
కెనడాలో భారతీయ మహిళను కాల్చివేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కెనడాలో ఉంటున్న పవన్ మన్ ప్రీత్ కౌర్ ( 21 ) ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. కాల్పుల ఘటన కలకలం చెలరేగడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.