ఆస్ట్రేలియాలో కొత్త రికార్డ్ సృష్టించారు భారతీయులైన తల్లీకూతుర్లు. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ లో తల్లీ కూతురు ఇద్దరు కూడా ఉద్యోగం సంపాదించి చరిత్ర సృష్టించారు. ఇలా తల్లీ కూతుర్లు ఒకే సంస్థలో పనిచేస్తూ వార్తల్లోకి ఎక్కారు. 2009 లో మంజీత్ కౌర్ తన భర్త రూప్ సింగ్ తో కలిసి మొదట అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 2013 లో ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు.
రాయల్ ఎయిర్ ఫోర్స్ లో మెడికల్ వింగ్ లో ఆఫీసర్ గా 2017 లో విధుల్లో చేరింది మంజీత్ కౌర్ . తన తల్లికి ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం లభించడంతో కుశ్రూప్ కౌర్ కూడా ఆస్ట్రేలియా వెళ్ళింది. 2022 లో రాయల్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ క్రాఫ్ట్ వుమెన్ గా ఉద్యోగం సంపాదించింది. ఒకే సంస్థలో తల్లీ కూతుర్లు ఉద్యోగం చేయడంతో పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.