అమెరికా తెలుగు సంఘం ( ఆటా ) 17 వ మహాసభలను జూలై 1 నుండి 3 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా అమెరికాలో జరిగే ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లను ఆహ్వానించారు ఆటా ప్రతినిధులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లను కలిసి ఆహ్వానించిన వారిలో ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల , ఆటా ప్రతినిధులు జయంత్ చల్లా , శరత్ వేముల , రఘువీర్ రెడ్డి , సన్నీ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఈ వేడుకలకు తప్పకుండా హాజరౌతానన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
Breaking News