ఐటీ రంగం రివర్స్ గేర్ లో పయనిస్తోంది. అమెరికాకు చెందిన అగ్ర శ్రేణి ఐటీ సంస్థ యాక్సెంచర్ ఐటీ ఎంప్లాయిస్ కు షాక్ ఇస్తోంది. ఇప్పటికే ఆర్ధిక మాంద్యం వల్ల పలు ఐటీ సంస్థలు ఎంప్లాయిస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు యాక్సెంచర్ కూడా చేరింది. 2021 లో పలువురికి ఆఫర్ లెటర్స్ ఇచ్చింది ఈ సంస్థ.
అయితే కరోనా ప్రభావం ఒకవైపున అలాగే ఆర్ధిక మాంద్యం మరో వైపున చుట్టుముట్టడంతో పలు సంస్థలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఇది చాలదన్నట్లు రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దాంతో యాక్సెంచర్ సంస్థ ఇచ్చిన ఆఫర్ లెటర్ లకు విలువ లేకుండాపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆఫర్ లెటర్స్ అందుకున్న వాళ్ళు. ఒక్క యాక్సెంచర్ మాత్రమే కాదు అమెజాన్ , విప్రో , ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా గూగుల్ , మైక్రో సాఫ్ట్ తదితర సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాంతో కొత్త నియామకాలు ఏవి చేపట్టడం లేదు.