
ప్రముఖ పారిశ్రామికవేత్త , UBlood app సృష్టికర్త జగదీశ్ యలమంచిలిని డాక్టరేట్ వరించింది. ఈ డాక్టరేట్ కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న పలువురు ప్రముఖులను పరిశీలించిన ” The Global Human Peace University ” మొత్తానికి దేశ వ్యాప్తంగా 10 మందిని ఎంపిక చేయగా అందులో జై యలమంచిలికి చోటు దక్కడం విశేషం. UBlood app ని సృష్టించి తద్వారా రక్తదానం గురించి అలాగే రక్తగ్రహీతల గురించి సమగ్ర సమాచారం ఉండేలా ఒకే యాప్ ను సృష్టించి రక్తదానం యొక్క గొప్పతనాన్ని , అవసరాన్ని చాటిచెప్పిన వ్యక్తి , శక్తి కావడంతో జై యలమంచిని డాక్టరేట్ అవార్డుతో సత్కరించింది ది గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ .
చెన్నై లోని యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ అవార్డు ఫంక్షన్ జరిగింది. నవంబర్ 26 న జరిగిన కార్యక్రమంలో జై యలమంచిలి అలియాస్ జగదీశ్ యలమంచిలిని డాక్టరేట్ అవార్డుతో సత్కరించారు. తనకు డాక్టరేట్ లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. డాక్టర్ జై యలమంచిలికి డాక్టరేట్ ప్రధానం చేయడంతో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. UBlood app కు ప్రముఖ నటులు సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. JSW & Jaiswaraajya.tv వంటి సంస్థలకు అడ్వైజర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ జగదీశ్ యలమంచిలి.