ఫోర్బ్స్ జాబితాలో జగిత్యాల యువకుడికి చోటు లభించింది. 50 మంది టాప్ సీఈఓ ల జాబితా ప్రకటించింది ఫోర్బ్స్ …… కాగా ఆ జాబితాలో జగిత్యాల వాసి అయిన సాగి రఘునందన్ రావు కు స్థానం లభించింది. తెలంగాణ లోని జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామానికి చెందిన రఘునందన్ రావు ఇంజినీరింగ్ చేసాడు.
అయితే ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళాడు. ఒకవైపు ఉన్నత చదువులు చదువుతూనే మరోవైపు అమెరికాలో పలు సంస్థల్లో ఉద్యోగం కూడా చేసాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మెటిక్ సంస్థ అయిన సెఫారా లో సీఐఓ గా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం ఇన్ స్పైర్ బ్రాండ్స్ సీఐఓ గా పనిచేస్తున్నాడు. పని చేస్తున్న సంస్థలో మెరుగ్గా రాణిస్తుండటంతో ఆ సంస్థలు అభివృద్ధి బాట పట్టాయి. దాంతో టాప్ 50 లో ఒకడిగా నిలిచి సంచలనం సృష్టించాడు రఘునందన్ రావు. దాంతో కుటుంబ సభ్యులు , బంధు మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.