బ్రేకింగ్ న్యూస్ ……. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే పై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు షింజో పై కాల్పులకు తెగబడ్డారు. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఈ సంఘటన జరిగింది. మాజీ ప్రధాని షింజో ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
షింజో పై రెండు రౌండ్ ల కాల్పులు జరిగాయి. తుపాకీ గుళ్ళు షింజో శరీరాన్ని చీల్చాయి దాంతో తీవ్ర రక్తస్రావమైంది. హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఆ షాక్ నుండి తేరుకున్న భద్రతా సిబ్బంది వెంటనే షింజో ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం షింజో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జులై 8 న జరిగింది.