పవర్ రేంజర్స్ సిరీస్ లో నటించిన ” జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ” ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. జాసన్ కు 49 సంవత్సరాలు మాత్రమే . ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు. పవర్ రేంజర్స్ సిరీస్ లో నటించిన జాసన్ డేవిడ్ మంచి పేరు సంపాదించాడు. కెరీర్ బాగుందని అనుకునేలోపు ఆత్మహత్య చేసుకోవడం పెద్ద చర్చగా మారింది.
అమెరికా లోని టెక్సాస్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు జాసన్ డేవిడ్ ఫ్రాంక్. తమ అభిమాన నటుడు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు అభిమానులు. అలాగే జాసన్ స్నేహితులు , బంధువులు కూడా తీవ్ర విచారం వెలిబుచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మృతికి కారణాలు కనిపెట్టే పనిలో పడ్డారు.