ఉత్తర అమెరికా తెలుగు సంఘము ( తానా ) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఓ పేద విద్యార్థినికి ల్యాప్ టాప్ అందించారు. తెలంగాణ రాష్ట్రం లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవెండి గ్రామానికి చెందిన కావ్యశ్రీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతోంది.
నిరుపేద కుటుంబానికి చెందిన కావ్యశ్రీ ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు తాళ్లూరి జయశేఖర్. మాజీ ఎంపిపీ వంశీకృష్ణ ద్వారా ల్యాప్ టాప్ ను కావ్యశ్రీ కి తానా ఫౌండేషన్ ఆదరణ కార్యక్రమం ద్వారా ఈ సహాయం అందించారు.