అమెరికాలో స్థిరపడిన JNTUH స్టూడెంట్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవంబర్ 5 న అమెరికాలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ న్యూజెర్సీలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు JNTUH వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరవ్వడం విశేషం.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ( JNTUH ) స్థాపించి 50 సంవత్సరాలు అవుతుండటంతో ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. 1972 లో హైదరాబాద్ లో ఈ యూనివర్సిటీ స్థాపించబడింది. గత 50 ఏళ్లుగా లక్షల సంఖ్యలో చదువుకున్న స్టూడెంట్స్ వేలాదిమంది వివిధ దేశాలలో అలాగే భారత్ లో అనేక ప్రాంతాల్లో తమ ప్రతిభా పాటవాలతో తమదైన రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు.
ఇక అమెరికాలో ఎక్కువ సంఖ్యలో JNTUH స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లంతా కలిసి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ ఆనంద్ తో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అందరు కూడా తమ అనుభవాలను , అప్పటి రోజులను తలచుకొని పరమానందభరితులయ్యారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్