అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నయోమి బైడెన్ పెళ్లి వైట్ హౌజ్ లో జరిగింది. జో బైడెన్ కు నయోమి మనవరాలు అవుతుంది. ఈమె లాయర్ గా పనిచేస్తోంది. తనకంటే మూడేళ్లు చిన్నవాడైన నీల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత నాలుగేళ్లుగా నయోమి – నీల్ లు సహజీవనం చేస్తున్నారు. వాళ్ళ ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నవంబర్ 19 న వైట్ హౌజ్ లో పెళ్లి జరిగింది.
వైట్ హౌజ్ చరిత్రలో ఇప్పటివరకు అధ్యక్షుల కొడుకు లేదా కూతుర్లకు మాత్రమే పెళ్లిళ్లు కాగా మొట్టమొదటి సారిగా జో బైడెన్ మనవరాలి పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు అందజేశారు. జో బైడెన్ ఈ పెళ్లి పనుల్లో చాలా చురుగ్గా వ్యవహరించారు. ఇరు కుటుంబాలకు చెందిన పలువురు కుటుంబ సభ్యులు పెళ్ళికి హాజరయ్యారు.