అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలి పెళ్లి ఈనెల 19 న అంగరంగ వైభవంగా వైట్ హౌజ్ లో జరుగనుంది. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు 18 మంది అధ్యక్షులు తమ వారసుల పెళ్ళిళ్ళను చేసారు. అయితే వాళ్ళు చేసిన పెళ్లిళ్లు కూతుర్లు లేక కొడుకులది కావడం విశేషం. అయితే మొదటిసారిగా ఓ అధ్యక్షుడి మనవరాలి పెళ్లి వైట్ హౌజ్ లో జరుగనుంది. ఆ ఘనత జో బైడెన్ సొంతం కాబోతోంది.
ఇక జో బైడెన్ మనవరాలి పేరు ఏంటో తెలుసా …… నవోమి బైడెన్. ఈమె వయసు 28 సంవత్సరాలు. అయితే తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన పీటర్ నీల్ ను ఈనెల 19 న పెళ్లి చేసుకోబోతోంది. గత నాలుగేళ్లుగా నవోమి – పీటర్ లు సహజీవనం చేస్తున్నారు. వాళ్ళ పెళ్ళికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నవంబర్ 19 న అంగరంగ వైభవంగా పెళ్లి జరుగనుంది.