తెలంగాణ లోని ఓ పల్లెటూరు పిల్ల ఇప్పుడు అమెరికాలో అమ్ముకుట్టిగా పేరుగాంచింది. ఈ భామ పేరు ”కళ్యాణి బొప్ప ”. అయితే కళ్యాణి బొప్ప అనే పేరు కంటే అమ్ముకుట్టి అంటేనే ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకో తెలుసా …….. పక్కాగా పల్లెటూరు పిల్ల అయిన ఈ భామ బిటెక్ లో మంచి ర్యాంక్ సాధించడంతో భర్త కార్తీక్ తో కలిసి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్ళింది.
అయితే పల్లెటూరు వాతావరణానికి అమెరికా వాతావరణానికి చాలా తేడా ఉండటంతో మొదట్లో చాలా కష్టమనిపించింది. తన అభిపాయాలను చెబుతుంటే విచిత్రంగా ఉన్నాయని అనడంతో దాన్నే యూట్యూబ్ లో పెట్టేసింది. ఇంకేముంది ఇప్పుడు ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉండటమే కాకుండా యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఒకవైపు ఉద్యోగం మరోవైపు యూట్యూబ్ ద్వారా ఆదాయం అలాగే డిజైనింగ్ చేస్తూ రెండు చేతులా కాకుండా ఏకంగా మూడు చేతులా సంపాదిస్తోంది అమెరికా అమ్ముకుట్టి.