భారత సంతతికి చెందిన వాళ్ళు అమెరికాలో స్థిరపడటమే కాకుండా పలు పదవులు చేపట్టి సత్తా చాటుతున్నారని భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించింది అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. అమెరికాలో ఉంటున్న భారతీయులు అమెరికా ఆర్ధిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని , అలాగే కీలక రంగాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ భారత్ సత్తా చాటుతున్నారని కొనియాడింది.
మే 23 న” ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ సమ్మిట్ అండ్ గాలా ” అనే కార్యక్రమం వాషింగ్టన్ డీసీ లో జరిగింది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. కాగా ఇదే వేడుకకు కమలా హ్యారిస్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యింది. వేదిక మీద ఇంతమంది భారతీయులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు కమలా హ్యారిస్. అన్నట్లు కమలా హ్యారిస్ కూడా భారత సంతతి అనే విషయం తెలిసిందే.