అమెరికాలోని ఎడిసన్ లో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. మహిళలు , పిల్లలు , పెద్దలు , యువతీయువకులు అనే తేడా లేకుండా అందరూ పవిత్ర కార్తీక మాస దీపోత్సవంలో పాల్గొన్నారు. అమెరికాలో ఉంటున్నప్పటికీ తమ సంస్కృతి , సంప్రదాయాలను ఆచరించడంలో ప్రవాసాంధ్రులు సిద్ధహస్థులు అనే చెప్పాలి. ఖండాంతరాలను దాటినప్పటికీ హైందవ సంస్కృతిని ప్రతిభింభించడంలో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఎడిసన్ లోని సాయి దత్త పీఠం, శ్రీ శివ విష్ణు టెంపుల్ లో శంకరమంచి రఘు శర్మ నేతృత్వంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది.
ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.