అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వాళ్ళు సత్తా చాటుతూనే ఉన్నారు. వివిధ కంపెనీలకు సీఈవో లుగా రాణిస్తున్నారు. అలాగే రాజకీయ రంగంలో కూడా తమ సత్తా చాటుతూ ఉన్నత పదవులను అలంకరిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన కాట్రగడ్డ అరుణ అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ గా విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని వెంట్రప్రగడ అనే గ్రామం కాట్రగడ్డ అరుణ స్వస్థలం. 1972 లోనే కాట్రగడ్డ అరుణ పేరెంట్స్ అమెరికా వెళ్లారు. అక్కడ మిల్లర్ ట్రాన్స్ పోర్టేషన్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్. తన స్నేహితుడైన మిల్లర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది కాట్రగడ్డ అరుణ. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. కాట్రగడ్డ అరుణ రిపబ్లికన్ పార్టీలో చురుగ్గా వ్యవహరించేది.
దాంతో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పోటీ చేసే అవకాశం లభించింది. తాజాగా అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా విజయం సాధించడంతో కాట్రగడ్డ అరుణను అభినందిస్తున్నారు పలువురు. ఇక కృష్ణా జిల్లా వాసులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అరుణ విజయం పట్ల.