పంజాబ్ లోని ఖలిస్తాన్ ను ప్రత్యేక దేశంగా చేయాలంటూ పాకిస్థాన్ అండతో కొంతమంది వేర్పాటువాదులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ అంటూ దేశం లోపల మాత్రమే కాదు దేశం వెలుపల కూడా నినాదాలు చేస్తున్నారు. తాజాగా కెనడాలో ఖలిస్తాన్ ఏర్పాటు చేయాల్సిందే అంటూ భారత్ పై విషం కక్కుతున్నారు.
దీపావళి పండుగ కావడంతో కెనడాలో ఉంటున్న భారతీయులు పెద్ద ఎత్తున సంతోషంగా టపాసులు కాల్చుతున్న సమయంలో కొంతమంది భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అలజడి సృష్టించారు. దాంతో భారతీయులు అందరూ ముక్త కంఠంతో వందేమాతరం నినాదాలు చేశారు. భారతీయులంతా వందేమాతరం నినాదాలు చేస్తున్న సమయంలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారతీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటన పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.