
ఫుట్ బాల్ లో ఒక శకం ముగిసింది. ఫుట్ బాల్ క్రీడకు వన్నెతెచ్చిన ” పీలే ” డిసెంబర్ 29 న మరణించాడు. పీలే వయసు 82 సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పీలే తన ఆటతీరుతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాడు. పీలే అసలు పేరు ” ఎడిసన్ అరాంట్స్ డో నాసిమియాంటో ”.
అయితే పీలే అనే పేరు రావడానికి కారణం ఏంటో తెలుసా ……. పోర్చుగీసు భాషలో ఫుట్ బాల్ ను కాలితే తంతే ” పీ ” అని చేసిన తప్పులను ఎత్తిచూపితే ” లే ” అనే అర్ధం వస్తుందట. దాంతో ఎడిసన్ అరాంట్స్ డోనాసిమియాంటో కాస్త ” పీలే ” అయ్యాడు. పీలే నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఫుట్ బాల్ అంటే ఎనలేని మక్కువ. కానీ ఫుట్ బాల్ ను కొనలేని దీనస్థితి దాంతో సాక్స్ లలో పేపర్లను చుట్టి ఫుట్ బాల్ గా మలిచి ఆడుకునేవాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా గుర్తింపు పొంది బ్రెజిల్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందించాడు. ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించి చరిత్ర సృష్టించాడు.