ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఎలిజబెత్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టే స్థాయికి ఎదిగింది. లిజ్ ట్రస్ కు చిన్నప్పటి నుండే రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. దాంతో ఒకవైపు చదువులు కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా పాల్గొంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంది. అయితే తొలుత ఓటమి చవిచూసింది …… అయినప్పటికీ అధైర్యపడకుండా గెలుపు కోసం కష్టపడింది. దాంతో కౌన్సిలర్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగింది. బ్రిటన్ ప్రధానిగా ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు ఆ బాధ్యతలు నిర్వహించగా మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచింది.
Breaking News