
అగ్రరాజ్యం అమెరికాలో ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహం డెలాయిట్ లో ప్రతిష్టించబడింది. 25 అడుగుల ఎత్తు 30 టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహం ఖరీదు ఎంతో తెలుసా …… అక్షరాలా 80 లక్షలు. అవును ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కోసం ఏకంగా 12 మంది సభ్యులు ఆరు నెలలకు పైగా కస్టపడి రూపొందించారు. ఇక ఈ విగ్రహం ఎక్కడ తయారయ్యిందో తెలుసా …… ఏకశిలా నగరంగా పేరు పొందిన వరంగల్ జిల్లాలో.
ఆంజనేయ స్వామి విగ్రహం తయారయ్యాక ఇక్కడి నుండి అమెరికాకు తరలించడానికి చాలా కష్టాలే పడ్డారు. అన్ని కష్టాలను ఎదుర్కొని అమెరికాలోని డెలాయిట్ లో ప్రతిష్టించారు. ప్రస్తుతం డెలాయిట్ లోని ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల చేత పూజలు అందుకుంటోంది. అమెరికా అంటే క్రిస్టియన్ కంట్రీ అనే విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్కడ కూడా సర్వమతాలకు స్థానముంది. దాంతో భారత్ నుండి పెద్ద సంఖ్యలో వెళ్తున్న హిందువులు తమ ఆరాధ్య దైవాలను అక్కడ కొలుస్తూనే ఉన్నారు….. హైందవ సంస్కృతిని చాటుతూనే ఉన్నారు.