
అగ్రరాజ్యం అమెరికాలోని ఎడిసన్ లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి కావడంతో ఆది దంపతులైన శివ పార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం పండుగలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ విదేశాలలో ఉన్న తెలుగువాళ్లు మాత్రం మన సంస్కృతి, సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు.
తాజాగా మహాశివరాత్రి ఉత్సవాలు అమెరికాలోని ఎడిసన్ లో ఘనంగా నిర్వహించారు ప్రవాసాంధ్రులు. ఎడిసన్ లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ , సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. శివ పార్వతుల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్, ఫౌండర్ శంకరమంచి రఘు శర్మ నేతృత్వంలో జరిగాయి. డాక్టర్ శివకుమార్ ఆనంద్ తో పాటుగా పలువురు ప్రముఖులు ఈ కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శివ పార్వతుల ఆశీర్వాదం అందుకున్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.