
ఆక్లాండ్ లో ఉగాది వేడుకలకు రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్ లో స్థిరపడిన తెలుగువాళ్లు ఏర్పాటు చేసుకున్న సంస్థ ” మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ న్యూజిలాండ్ ”. ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు వాళ్లను మరింత ఐక్యంగా ఉండేలా చేస్తోంది. ఉగాది పండగ అంటే తెలుగువాళ్ళకు ప్రీతికరమైన పండగ దాంతో ఉగాది వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసారు మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ న్యూజిలాండ్.
తెలుగువాళ్ళ సంస్కృతీ , సంప్రదాయాలను తెలియజేసేలా వినోదభరితమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు నిర్వాహకులు. తెలుగింటి భోజనం , ఉగాది పచ్చడి తదితర వంటకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉగాది వేడుకలు ఆక్లాండ్ లో ఈనెల 19 న జరుగనున్నాయి. మార్చి 19 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుండి ఫ్రీమాన్స్ బే కమ్యూనిటీ సెంటర్ ,ఆక్లాండ్ ఉగాది వేడుకలకు వేదికగా మారనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొననున్నారు.