
సింగపూర్ లో ఉంటున్న తెలుగువాళ్లు మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. సింగపూర్ లో ఉంటున్న దాదాపు 1200 మంది కుటుంబాలకు బిర్యానీని అందించారు సింగపూర్ తెలుగు సమాజం నిర్వాహకులు. దేశం కానీ దేశంలో ఉంటున్న తెలుగువాళ్ళకు ఆసరాగా ఉండటానికి ” సింగపూర్ తెలుగు సమాజం ” అనే స్వచ్ఛంద సంస్థని నెలకొల్పారు.
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక మే 1 న కార్మికుల దినోత్సవం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేడే ఉత్సవాలను నిర్వహించారు. 1200 మందికి బిర్యానీ ప్యాకెట్లను అందించారు. ఇక సింగపూర్ లో ఉంటున్న తెలుగువాళ్ళకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ , సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ మేడే శుభాకాంక్షలు తెలిపారు.