తానా ఫౌండేషన్ ట్రస్టీ కార్యదర్శి, మూవర్స్ డాట్ కామ్ అధినేత గారపాటి విద్యాధర్ న్యూజెర్సీలోని తెలుగు ఎన్నారై మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2022 ఏడాది ముగింపు సందర్బంగా మీడియా ప్రతినిధులకు హ్యాపి హాలిడేస్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుక న్యూజెర్సీ , ఎడిసన్ లోని సముద్ర రెస్టారెంట్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్నారై మీడియా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్న మీడియా ప్రతినిధులు తాము మాత్రం వెనకాలే ఉండి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని , అలాంటి వాళ్ళను సన్మానించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టానని తెలిపారు గారపాటి విద్యాధర్.
JSW & Jaiswaraajya.tv యాంకర్ ,న్యూజెర్సీ , ఎడిసన్ న్యూస్ జర్నలిస్ట్ అయిన స్వాతి దేవినేనితో పాటుగా పలువురు మీడియా ప్రతినిధులను గారపాటి విద్యాధర్ ఘనంగా సన్మానించారు. మానవతా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి గొప్ప మానవతావాదిగా పేరుగాంచారు గారపాటి విద్యాధర్.