ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం అమీనాపురంలో తానా ఫౌండేషన్ – రోటరీ హాస్పిటల్ విజయవాడ సంయుక్తంగా ఈ క్యాంప్ నిర్వహించారు. మే 22 న అమీనాపురంలో ఐ క్యాంప్ నిర్వహించగా పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు పాల్గొన్నారు.
300 మందికి పైగా ప్రజలు తమ కంటి పరీక్షలను చేయించుకోగా అందర్నీ పరీక్షించిన డాక్టర్లు అవసరమైన వాళ్లకు కళ్ళ జోళ్ళు కూడా ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసింది అనిత ఎర్నేని.






