భారత ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. భారతదేశంలో 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో అభినందనలు తెలియజేసారు. భారత్ లాంటి పెద్ద దేశంలో 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి ఉచితంగా ఇవ్వడం సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు బిల్ గేట్స్.
దేశీయంగా పలు రకాల కరోనా వ్యాక్సిన్ లు తయారైన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ని ఒక ఉద్యమంగా చేపట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో ఈ అరుదైన ఘనత భారత్ సొంతమైంది. ఇక ఇప్పుడేమో బూస్టర్ డోసులను కూడా పూర్తి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడమే కాకుండా మళ్ళీ ఉద్యమంలా చేస్తున్నారు. భారత్ లో కరోనాని రూపు మాపాలనే కృత నిశ్చయంతో ఉంది మోడీ ప్రభుత్వం.