భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులతో ముచ్చటించారు మోడీ. భారత్ ను డిజిటల్ ఇండియా గా మారుస్తున్నామని , 2014 లో భారత్ లో కేవలం 400 లోపే స్టార్టప్ కంపెనీలు ఉండేవని , కానీ మేకిన్ ఇండియా ప్రోగ్రాంతో ఇప్పుడా సంఖ్య 68 వేలకు చేరిందని ఇదంతా ఈ ఎనిమిదేళ్ల పాలనలో చేశామని స్పష్టం చేసారు మోడీ.
గత ప్రభుత్వాలు రైతులకు , ప్రజలకు పలు సంక్షేమ పథకాలు చేపట్టాయని కానీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్న ప్రతీ రూపాయితో కేవలం 15 పైసలు మాత్రమే వాళ్లకు చేరేదని , మిగతా 85 పైసలు తినేవాళ్ళని , కానీ మా ప్రభుత్వం వచ్చాకా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే ఆ డబ్బులు వేస్తున్నామన్నారు.