ప్రవాస భారతీయులు శ్రీ ఉపేంద్ర చివుకులకు డాక్టరేట్ లభించడంతో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమం న్యూజెర్సీలోని ఎడిసన్ లోగల సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. థామస్ ఎడిసన్ స్టేట్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు ఉపేంద్ర చివుకుల.
ఓ ప్రవాసాంధ్రుడు ఈ అరుదైన గౌరవాన్ని పొందడంతో పలువురు ఎన్నారైలు డాక్టర్ ఉపేంద్ర చివుకులను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సన్మాన కార్యక్రమం అక్టోబర్ 16 న ఎడిసన్ లోని సాయి దత్త పీఠం లో జరిగింది. ఈ కార్యక్రమంలో Ublood ఫౌండర్ జై యలమంచిలి, సాయి దత్త పీఠాధిపతి శంకరమంచి రఘు శర్మ , రమేష్ యలమంచిలి, JSW & Jaiswaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్