అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీని కిడ్నాప్ చేయడానికి ఓ దుండగుడు తీవ్ర ప్రయత్నం చేసాడు. అయితే పెలోసీ ఇంట్లోకి దుండగుడు చొరబడిన సమయంలో ఆమె లేకపోవడంతో ఈ భారీ ప్రమాదం నుండి బయటపడింది. అయితే ఆ దుండగుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో నాన్సీ పెలోసీ భర్త పౌల్ పెలోసీ (82) ఉన్నాడు. దాంతో ఆ దుండగుడు సుత్తితో అతడిపై దాడి చేసాడు.
అంతేకాదు నాన్సీ ఎక్కడ అంటూ బిగ్గరగా అరిచాడట. నాన్సీ పెలోసీ పై కావాలనే దాడి చేయడానికి వచ్చాడని , ఆమె కనుక ఆ సమయంలో ఉంటే చాలా దారుణం జరిగి ఉండేదని భావిస్తున్నారు పోలీసులు. నిందితుడు నాన్సీ ని కిడ్నాప్ చేయడానికి టేప్ రోల్ , తాడు , సుత్తి వంటివి తన వెంట తెచ్చుకున్నాడు. ఆ దుండగుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నాన్సీ పెలోసీ 2006 లో మొదటిసారిగా అమెరికా ప్రతినిధుల స్పీకర్ గా ఎన్నికయ్యారు. తాజాగా 2019 లో మరోసారి ఆ బాధ్యతలు చేపట్టారు.