నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగువారందరి మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ మరణం తెలుగుసినీ పరిశ్రమకు తీరని లోటని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి అన్నారు.
కైకాల సత్యనారాయణ ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి తెలుగువారందరిని మెప్పించారని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి( బాపు) నూతి పేర్కొన్నారు. తామంతా సత్యానారాయణ సినిమాలు చూస్తూ పెరిగామని.. ఆయన వేసిన పాత్రలు, ఆయన చేసిన నటన మరువలేనివని నాట్స్ సభ్యులు తెలిపారు. నాట్స్ తరపున కైకాల సత్యనారాయణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.