పిల్లలు ఆడుకునే బొమ్మల కలెక్షన్ కోసం నడుం బిగించారు ఎడిసన్ పోలీసులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. అమెరికాలోని ఎడిసన్ లోగల పేద పిల్లల కోసం ఈ బొమ్మల కలెక్షన్ కు పూనుకుంది ఎడిసన్ పోలీస్ డిపార్ట్ మెంట్. ఖరీదైన బొమ్మలను కొనుక్కోలేని పేద పిల్లల కోసం కనీసం 100 బొమ్మలైనా సేకరించాలని భావించారు.
సేవా దృక్పథం కలిగిన వాళ్లతో కలిసి ఎడిసన్ పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. కొంతమంది బొమ్మలు కొనివ్వగా మరికొందరు డబ్బులు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమం ఎడిసన్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన షిప్ డొనాల్డ్ నేతృత్వంలో జరిగింది. ఇక పిల్లల కోసం కావడంతో పలువురు ప్రవాస భారతీయులు కూడా ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నారు.