![Norway is a grand welcome for Indians](https://jaiswaraajya.tv/wp-content/uploads/2022/11/png_20221127_091803_0000.png)
భారతీయులకు గ్రాండ్ వెల్కమ్ అంటోంది నార్వే ప్రభుత్వం. భారత పర్యాటకులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటక వీసాలను మంజూరు చేస్తోంది నార్వే ప్రభుత్వం. గత 10 నెలల కాలంలో అత్యధికంగా 13 వేలకు పైగా పర్యాటక వీసాలను మంజూరు చేసింది అక్కడి ప్రభుత్వం.
నార్వే వీసా పొందాలంటే గరిష్టంగా 60 రోజులు మాత్రమే పడుతుండటం గమనార్హం. ఇక వీసాలు మంజూరు చేయడానికి పెద్దలకు 6700, కాగా చిన్నారులకు 3252 రూపాయలు రుసుము గా వసూల్ చేస్తున్నారు. గత 10 నెలలుగా నార్వే దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది.
ఇక పర్యాటక రంగం ద్వారా నార్వే ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుండటంతో ప్రోత్సాహకాలు అందిస్తోంది. దాంతో ఉభయకుశలోపరిగా అటు భారతీయులకు ఇటు నార్వే ప్రభుత్వానికి లాభం చేకూరుతోంది.