తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలోని ఎన్నారై జగదీష్ యలమంచిలి ఇంట సందడి చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు తనతో కలిసి ఇంజినీరింగ్ చేసిన వాళ్ళని కలిశారు. తనతో ఇంజినీరింగ్ చేసిన వాళ్ళందరిని కలవాలని భావించారు. కాగా అందుకు వేదికగా నిలిచింది ఎన్నారై జగదీష్ యలమంచిలి నివాసం. న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు జగదీష్ యలమంచిలి. కాగా అక్కడే దేవినేని తన స్నేహితులను కలిశారు. తెలుగుదేశం పార్టీని మళ్లీ ఏపీలో అధికారం లోకి తీసుకురావడానికి మిత్రుల సలహాలను తీసుకున్నారు. తన మిత్రులను కలవడంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ ఆనంద్ కూడా పాల్గొన్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్