గతేడాది ఎంతమంది భారతీయులు తమ పౌరసత్వం వదులుకున్నారో తెలుసా ……. 1.6 లక్షల మంది. అవును ఈ విషయాన్ని భారత హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్ లో లెక్కలతో సహా వెల్లడించారు. భారత పౌరసత్వం వదులుకున్న వాళ్లలో ఎక్కువగా అమెరికాలో స్థిరపడుతున్నారు. 2020 లో 85,256 మంది భారత పౌరసత్వం వదులుకోగా 2021 లో మాత్రం 1,63,370 మంది పౌరసత్వం వదులుకున్నారని వెల్లడించారు.
2020 లో భారత పౌరసత్వం వదులుకున్న వాళ్లలో 30,828 మంది అమెరికాలో స్థిరపడగా 2021 లో 78,284 మంది అమెరికాలో స్థిరపడ్డారని ఆస్ట్రేలియాలో 2020 లో 13518 మంది స్థిరపడ్డారు. 2021 లో మాత్రం 23,533 మంది ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. అమెరికా , ఆస్ట్రేలియా లతో పాటుగా కెనడా , బ్రిటన్ , ఇటలీ , సింగపూర్ , జర్మనీ , స్వీడన్ , నెదర్లాండ్స్ తదితర దేశాల్లో కూడా భారతీయులు స్థిరపడుతున్నారని తెలిపారు. అంటే ప్రపంచమంతటా భారతీయులు తమ సత్తా చాటుతున్నారన్న మాట.