డాలర్ రోజు రోజుకు మరింతగా బలపడుతోంది. అయితే అదే సమయంలో ప్రపంచ దేశాల్లోని కరెన్సీ మాత్రం ఘోరంగా బలహీనపడుతోంది. తత్ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్ధిక మాంద్యంలో చిక్కుకోగా అమెరికా మాత్రం ఆర్ధికంగా మరింత బలపడుతోంది. 51 సంవత్సరాల క్రితం అమెరికా ఆర్ధిక మంత్రి జాన్ కొనల్లి చేసిన వ్యాఖ్యల ప్రకారం అమెరికా డాలర్ ” ప్రపంచ మానవాళి పై వేసిన పచ్చబొట్టుగా చెప్పాలి …… ఎందుకంటే డాలర్ ఇప్పటికీ , ఎప్పటికి అమెరికాకు కరెన్సీనే ……. ప్రపంచానికి మాత్రం అన్నీ డాలరే !
అమెరికా డాలర్ విలువ తగ్గినా పెరిగినా అది ప్రపంచ వ్యాప్తంగా మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంటుందని చెప్పాడు. 51 సంవత్సరాల క్రితం జాన్ చెప్పిన విషయం ఇప్పటికీ ప్రపంచాన్ని శాసిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీ విలువ తగ్గిపోతూ ఉంటే డాలర్ విలువ మాత్రం పెరిగిపోతూనే ఉంది పాపకూపంలా . ఒక్క అమెరికా డాలర్ కు మన కరెన్సీ ప్రకారం ఎంత ఇవ్వాలో తెలుసా …… దాదాపుగా 80 రూపాయలు అన్నమాట. అదీ డాలర్ పరిస్థితి.