అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్ళాడు గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్( 32 ). ట్రెక్కింగ్ కోసం అట్లాంటా లోని క్లీవ్ లెన్స్ మౌంటెన్ హిల్స్ కు వెళ్ళాడు. అయితే పర్వతారోహణ చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు జారి పడటంతో 200 అడుగుల లోతులో పడ్డాడు. దాంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
విహారయాత్ర కాస్త విషాదం కావడంతో శ్రీనాథ్ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. ప్రవాసాంధ్రుల సహాయంతో శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరు కు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ కు తిరిగి తీసుకు వచ్చాక అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించనున్నారు. శ్రీనాథ్ కు ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. భార్య కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది.