
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్బంగా మరణించిన కుటుంబాలకు అండగా నిలవడానికి టీడీపీ ఎన్నారై సెల్ ముందుకు వచ్చింది. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు టీడీపీ ఎన్నారై సెల్ నాయకులు జయరాం కోమటి.
నిన్నటి సంఘటనలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే తెలుగుదేశం అధినేత ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ ఎన్నారై శాఖ తరుపున, నా తరుపున కూడా లక్ష రూపాయలను అందిస్తునట్లుగా ప్రకటించారు కోమటి జయరాం. అంతేకాకుండా మృతుల కుటుంబ సభ్యులలో ఎవరైనా పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటే వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి టీడీపీ ఎన్నారై సెల్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.