
అట్లాంటాలో మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించడానికి నడుం బిగించింది NRI Vasavi Association – Atlanta శాఖ. అట్లాంటాలో ఈనెల 25 న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ మహిళా దినోత్సవ వేడుకలలో వినోద కార్యక్రమాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మహిళల ఫ్యాషన్ షో కూడా నిర్వహించనున్నారు. అలాగే రాత్రికి మంచి విందు కూడా ఏర్పాటు చేసారు. అయితే ఈ వేడుకలకు కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంది. ఈ కార్యక్రమంలో ఎలాంటి రుసుము చెల్లించకుండానే పాల్గొనే అవకాశం కల్పిస్తోంది.