
NRI భర్తలు తమ భార్యలను వదిలేస్తూ , అధిక కట్నాలను డిమాండ్ చేస్తూ నానా హింసలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకొని తమ సహధర్మ చారిణి లతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాల్సింది పోయి ……. అధిక కట్నం డిమాండ్ చేస్తూ….. లేదంటే పెళ్ళాం పై మోజు తీరగానే వాళ్లను హింసిస్తూ విడాకులు ఇస్తున్నారు. దాంతో విడాకులు పొందిన మహిళలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే కొంతమంది తీవ్ర నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి అండగా నిలవాలని భావించింది పంజాబ్ కు చెందిన సర్విందర్ కౌర్ . ఎన్నారై పురుషులు అందరూ విడాకులు ఇవ్వడం లేదు కానీ అందులో కొంతమంది ఎన్నారైలు మాత్రం వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ కొంతకాలం కాపురం చేసిన తర్వాత రకరకాల కారణాల పేరుతో విడాకులు ఇస్తున్నారు. దాంతో వాళ్లకు అండగా నిలవాలని భావించింది సర్విందర్ కౌర్.

41 సంవత్సరాల వయసున్న సర్విందర్ కౌర్ కూడా NRI భర్త వదిలేసిన మహిళ కావడం విశేషం. ఎన్నో ఆశలతో కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన కౌర్ కు భర్త చేతిలో ఘోర అవమానం జరిగింది. చివరకు విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకోకుండా తనకు న్యాయం జరగాలని గట్టిగా పోరాటం చేసిందట. ఆ సమయంలో తనకు ఎవరూ అండగా లేకపోవడంతో ఒక స్థిర నిర్ణయానికి వచ్చిందట. మానసికంగా కృంగి పోకుండా తనలాగే బాధపడే మహిళలకు అండగా నిలవాలని , న్యాయ సలహాలు ఇవ్వాలని ఓ NGO సంస్థను నెలకొల్పింది. ఆ సంస్థ ద్వారా పలువురు మహిళలకు న్యాయం చేస్తోంది. సర్విందర్ కౌర్ చేస్తున్న సహాయానికి ఫిదా అవుతున్నారు మహిళలు. అలాగే ఆమె చేస్తున్న సేవల పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






