NTR SathaJayanthi : యుగపురుషుడికి ప్రవాస భారతీయులు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ శత జయంతిని వైభవంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈ ఉత్సవాలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్థన్ తోపాటు.. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ, బీజేపీ నేత పాతూరి నాగభూషణం, ఏపీ ఎన్నార్టీ మాజీ చైర్మన్ వేమూరి రవికుమార్ పాల్గొన్నారు.
ఎన్నారైలు పెద్ద ఎత్తున ఈ ఎన్టీఆర్ శతజయంతిలో పాల్గొని ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎంపీ రఘురామతోపాటు టీడీపీ నేతలు ఎన్టీఆర్ అందించిన సేవలను కొనియాడారు. తెలుగు జాతి గర్వించే నేత.. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన నేత ఎన్టీఆర్ అన్నారు. ఆత్మగౌరవ నినాదంతో తెలుగువారి అభ్యున్నతికి పాటుపడిన ఎన్టీఆర్ కృషిని వేయినోళ్ల ప్రశంసించారు.
మన్నవ మోహన కృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ శతజయంతి వేడుకల్లో వెనిగళ్ల వంశీ, నల్లమల్ల రాధాకృష్ణ, వెనిగళ్ల మోహన్ కుమార్ తోపాటు భారీ సంఖ్యలో ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.