నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు శతజయంతి వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోగల ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉండే స్టెర్లింగ్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఏడాది పాటు చేయడానికి ప్లాన్ చేసారు ఉయ్యురు శ్రీనివాస్.
మే 28 న ఎన్టీఆర్ జయంతి కావడంతో ఆ సందర్బంగా తెలుగుజాతి పౌరుషానికి ప్రతీకగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ శుక్రవారం , శని , ఆది వారాలలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ప్రదర్శిస్తామని ఈ కార్యక్రమం ఏడాది పొడవునా ఉంటుందన్నారు. ఇక ప్రతీ రోజు 1000 మందికి అన్నదానం చేయాలనే సంకల్పంతో నందమూరి బాలకృష్ణ చేత గుంటూరు లో అన్న క్యాంటిన్ ని ప్రారంభించనున్నామన్నారు.