ప్రపంచంలో తెలుగువాళ్లు నలుమూలలా ఉన్నారని , అయితే ఎక్కడ ఉన్నా మన మట్టి వాసన మర్చిపోవద్దని , తెలుగుదనాన్ని అస్సలు వీడొద్దన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఎడిసన్ లోని సాయి దత్త పీఠం ని దర్శించుకున్న తర్వాత నార్త్ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ.
నార్త్ అమెరికా తెలుగు సంఘం జస్టిస్ ఎన్వీ రమణని ఘనంగా సన్మానించింది. సత్కారం అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు జస్టిస్ ఎన్వీ రమణ. అమెరికా వంటి పాశ్చాత్య దేశంలో ఉంటూ కూడా మన దేశ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటికి పెద్ద పీట వేస్తున్న మిమ్మల్ని తప్పకుండా అభినందించాల్సిందే అంటూ ప్రవాసాంధ్రులపై ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.