భారీ వర్షాలతో భారీ వరదలతో పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాకిస్తాన్ లోని 3 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు 1000 మందికి పైగా మరణించారు. ఎడతెరిపి లేని వర్షాలతో , వరదలతో అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్ కు కునుకు లేకుండా చేస్తోంది మరో వార్త. హిమాలయ పర్వతాలు కరిగిపోతూ భారీ వరదలుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖా నిపుణులు.
హిమాలయాలలోని నదులతో అలాగే హిమాలయ పర్వతాలతో పాకిస్థాన్ కు ఎక్కువగా నష్టం వాటిల్లనున్నట్లు పేర్కొంటున్నారు. హిమాలయ పర్వతాల వల్ల పాకిస్తాన్ తో పాటుగా భారత్ కు కూడా ముప్పు పొంచి ఉందని కాకపోతే ఎక్కువ నష్టం జరిగేది మాత్రం పాకిస్థాన్ కు అని అంటున్నారు భారత్ కు చెందిన వాతావరణ నిపుణులు.