మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ , బీజేపీ , టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు పోటీ పడ్డారు.
పాల్వాయి స్రవంతి , కృష్ణారెడ్డి , పల్లె రవి , కైలాష్ నేత తదితరుల పేర్లు అధిష్టానం కు పంపించగా అందులో పాల్వాయి స్రవంతి పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. టికెట్ దక్కడంతో పాల్వాయి స్రవంతి చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలోని నాయకులను , కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోతానని , ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు పాల్వాయి స్రవంతి.