కెనడాలో భారతీయులకు శాశ్వత నివాస హోదా అందిస్తోంది ఆదేశం. కెనడాకు ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో వలసదారులు వస్తున్నారు. ప్రతీ ఏటా 62 శాతం ప్రజలు వలస వస్తున్నారట. అందులో భారతీయుల వాటా నెంబర్ వన్ గా ఉంది. 18 శాతానికి పైగా భారతీయులు కెనడాకు వలస వెళ్తున్నారు. ఇలా వెళ్లిన వాళ్లలో దాదాపు లక్ష మందికి శాశ్వత నివాస హోదా ఇచ్చింది కెనడా.
ప్రతీ ఏటా 5 లక్షల మందికి పైగా వలదారులకు అనుమతి ఇవ్వాలని భావించిందట కెనడా. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది. కెనడాకు పెద్ద ఎత్తున వలస వెళ్తున్న వాళ్లలో భారతీయులతో పాటుగా ఇతర దేశాలకు చెందిన వాళ్ళు అంటారియో , క్యూబెక్ , ప్రిన్స్ ఎడ్వార్డ్ ద్వీపం , న్యూ పౌండ్ ల్యాండ్ , లాబ్రడార్ , సస్కట్చేవాన్ , మానిటో బాలో తదితర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు.