అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. దాంతో పలువురు ప్రయాణీకులు మరణించారు. అయితే మరణించిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. ఈ సంచలన సంఘటన ఈరోజు కాలిఫోర్నియాలో జరిగింది. వాట్సాన్ విల్లే లోని మున్సిపల్ విమానాశ్రయంలో రెండు చిన్న విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించాయి.
అయితే రెండు కూడా ల్యాండ్ అయ్యే సమయంలోనే ఢీకొన్నాయి. దాంతో రెండు విమానాలు కూడా బలంగా ఢీకొనడంతో భారీగా దెబ్బతిన్నాయి. మంటలు కూడా వ్యాపించాయి. దాంతో పలువురు ప్రయాణీకులు మరణించారు. అయితే మరణించిన వారు ఎవరు ? ఎంతమంది మరణించారు ? అన్నది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking News