
ఇండోనేషియాలో అద్భుతం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసాడు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్. భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ కావడంతో అతడిపై స్పెషల్ అటెన్షన్ నెలకొంది. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైన విషయం తెలిసిందే. జి 20 శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియాలో జరుగుతుండటంతో మోడీ ఆ సదస్సుకు హాజరయ్యాడు, ఇక రిషి సునాక్ కూడా ఆ సమావేశంలో పాల్గొనడంతో మోడీని కలిశారు. ఇద్దరూ ముచ్చటించుకుంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.