అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో ఆటా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. జులై 1 నుండి 3 వ తేదీ వరకు మొత్తం 3 రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ వేడుకలలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తరలివచ్చారు. ఇక ప్రవాసాంధ్రులు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. మరికొద్ది గంటల్లోనే అమెరికాలో ఆటా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.