బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ – || ఇక లేరు. 96 ఏళ్ళ ఎలిజబెత్ 2 బ్రిటన్ లో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షిగా నిలిచారు. దాదాపు 70 సంవత్సరాల పాటు బ్రిటన్ ని పరిపాలించారు. విరామం కోసం స్కాట్లాండ్ లోని బల్మోరల్ కోటకు వెళ్లిన సమయంలోనే తుదిశ్వాస విడిచారు రాణి. దాంతో బ్రిటన్ లో 10 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఇక రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలు 10 రోజుల తర్వాత లండన్ లోని వెస్ట్ మినిష్టర్ అబ్బే చర్చిలో నిర్వహించనున్నారు. క్వీన్ ఎలిజబెత్ మృతికి ప్రధాని మోడీతో పాటుగా పలువురు దేశాధినేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Breaking News