బాలా త్రిపుర సుందరి నవరాత్రి వేడుకలు అమెరికాలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికా లోని సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ లో ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక ఇదే రోజున సాయి దత్త పీఠం చైర్మన్ శంకరమంచి రఘు శర్మ పుట్టినరోజు కావడంతో ఇదే కార్యక్రమంలో జన్మదిన వేడుకలు కూడా భారీ ఎత్తున నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో JSW & Jaiswaraajya అడ్వైజర్ , UBlood ఫౌండర్ జగదీష్ యలమంచిలితో పాటుగా పలువురు తెలుగువాళ్లు పాల్గొన్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే రఘు శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.